మన్యంలో ప్రశాంతంగా పోలింగ్..


Ens Balu
2
Paderu
2021-02-17 19:40:40

గ్రామ పంచాయతీ ఎన్నికల మూడవ విడత పోలింగ్ పాడేరు ఏజెన్సీ లో ప్రశాంతంగా జరిగిందని  జిల్లా కలెక్టర్,  జిల్లా ఎన్నికల అధారిటీ వి.వినయ్ చంద్  అన్నారు.  బుధవారం ఆయన పాడేరులో  పర్యటించి  వంట్లమామిడి  గ్రామంలో  జరుగుతున్న పోలింగ్  ప్రక్రియను  పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ  మన్యంలో  237 గ్రామ పంచాయితీలలో  పోలింగ్ జరిగిందన్నారు.  మహిళలు, వృద్దులు  పెద్ద ఎత్తున  తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.  2014 కంటే పోలింగ్ శాతం  పెరిగిందన్నారు.  ఏజెన్సీ పరిధిలో 69.28 శాతం పోలింగ్ నమోదు  అయిందని చెప్పారు.  ఓట్లు లెక్కింపు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.   పోలింగ్ సిబ్బందికి రవాణా సౌకర్యాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు.  జిల్లా యంత్రాంగం మొత్తం  ఏజెన్సీలో  ఎన్నికల  ప్రక్రియను  పర్యవేక్షిస్తున్నారని,  ఎటువంటి  ఇబ్బందులు లేకుండా  పోలింగ్ జరిగిందని తెలిపారు.  ఈ  కార్యక్రమంలో  ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, అదనపు జిల్లా ఎన్నికల  అథారిటి, డా. ఎస్.  వెంకటేశ్వర్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.   
సిఫార్సు