జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలి


Ens Balu
1
Golugonda
2020-08-17 18:06:22

జర్నలిస్టులు కరోనా సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన జాగ్రత్తలు పాటిస్తూ తమవిధులు నిర్వహించాలని గొలుగొండ తహశీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ డేవిడ్రాజు, ఎస్.నారాయణరావులు సూచించారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని గొలుగొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.  గొలుగొండ. క్రిష్ణదేవిపేట ప్రాంతాలకు చెందిన విలేకరులు ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ , ఎంపీడీవో, ఎస్ఐలు ఆవిర్భావ దినోత్సవానికి గుర్తుగా  మొక్కలు నాటారు.  ఈ కార్యక్రమంలో  ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సింగంపల్లి చిన్నయ్యనాయుడు మాట్లాడుతూ, జర్నలిస్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వారియర్స్ గా గుర్తించాలన్నారు. ఎవరైనా కరోనా వైరస్ తో మ్రుతి చెందితే తక్షణమే రూ.50 లక్షల భీమా వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు .పి సత్యనారాయణలు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు.ఎస్ నానాజీ,  జిల్లా కార్యవర్గ సభ్యుడు జె.నరసింహమూర్తీ , ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు ఆర్ .బాబులు  తదితరులు పాల్గొన్నారు.