విధినిర్వహణలో అలక్ష్యం వహిస్తే ఇంటికి పంపిస్తా..
Ens Balu
3
Paderu
2021-02-20 17:05:07
విధులకు గైర్జాజరైన గ్రామ సిచివాలయం సిబ్బందిపై ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల ఆగ్రహం వ్యక్తం చేసారు . వంతాడపల్లి గ్రామ సచివాలయాన్ని ప్రాజెక్టు అధికారి శని వారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేసారు. గ్రామ సచివాలయ సిబ్బంది హాజరు పరిశీలించి నలుగురు సిబ్బంది విధులకు హాజరు కాలేదని గుర్తించి పంచాయతీ కార్యదర్శులు ఎం. హైందవి, ఎన్.మత్స్యరాజు, సర్వేయర్ సిటిబి ఎస్ ఎన్ అప్పరాజు, మహిళాపోలీస్ కె.జయశ్రీలకు షోకాజ్ నోటీస్ జారీ చేసారు. గ్రామ సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సచివాలయంలోనే పౌర సేవలన్ని ప్రజలకు అందించాలన్నారు. అనంతరం మినీ వ్యాన్‌లో ఇంటింటికి పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్నితనిఖీ చేసారు. బియ్యం పంపిణీలో కచ్చితమై తూకం ఉండాలన్నారు. సకాలంలో పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామస్తులతో మాట్లాడి అటవీ హక్కుపత్రాలు అందరికి అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. బియ్యం ఇంటింటికి పంపిణీ చేయడం గిరిజనులను స్పందన ఆరా తీసారు. ఇంటికి తెచ్చి బియ్యం పంపిణీ చేయడం పై లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేసారు. అందరూ దోమ తెరలు వినియోగించాలని ప్రాజెక్టు అధికారి సూచించారు.