గిరిభూమి పనులు వేగవంతం చేయాలి..


Ens Balu
3
Komarada
2021-02-20 17:07:20

రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని గిరిజన రైతులకు భూములు మంజూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమం చేపట్టారని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.  ప్రాజెక్ట్ అధికారి శనివారం తన పర్యటనలో జియ్యమ్మ వలస, కురుపాం, కొమరాడ మండలాల తహశీల్దార్ కార్యాలయంలో ఆర్.ఓ.ఎఫ్ ఆర్ పట్టాల పంపిణీపై నేటికి చేపట్టిన పనులు పై ఆరా తీశారు. జియ్యమ్మ వలస మండలంలో 2314, కురుపాం మండలంలో 8644, కొమరాడ మండలంలో 3165 మంది లబ్ధిదారులకు సంబందించి గిరి భూమి వెబ్సైట్ లో చేపడుతున్న  ఆన్లైన్ అప్డేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గిరి భూమి  వెబ్సైట్ లో చేపడుతున్న  ఆన్లైన్ అప్డేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అలాగే ఆధార్ నెంబర్, తండ్రి పేరు తదితర వివరాలు ఎక్కడా తప్పులు జరగకుండా చూడాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో కురుపాం, కొమరాడ  తహసీల్దార్లు, జియ్యమ్మ వలస డిప్యూటీ తహశీల్దార్, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.