సర్పంచ్ కి జర్నలిస్టుల సత్కారం..


Ens Balu
3
Annavaram
2021-02-21 19:00:20

అన్నవరం గ్రామ పంచాయతీని తూర్పుగోదావరి జిల్లాలోనే బెస్ట్ పంచాయతీగా అభివ్రుద్ధి చేస్తామని  గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పేర్కొన్నారు. ఆదివారం ఎస్వీఎస్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నవరం నూతన సర్పంచ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సత్యదేవుని ఆశీస్సులతో ప్రజలకు సేవచేసుకునే అవకాశం దక్కిందన్నారు. గ్రామంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించడంతోపాటు, ప్రజలకు చేరువగా ఉండి సేవచేసుకుంటానని అన్నారు. గ్రామ సర్పంచ్ గా పాలన చెయ్యాలనే చిరకాలవాంఛను  అన్నవరం ప్రజలు నెరవేర్చార్నారు. జర్నలిస్టులు కూడా గ్రామాభివ్రుద్ధికి మంచి సూచనలు, సలహాలు అందించాలన్నారు. సర్పంచ్ ని కలిసిన వారిలో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యదర్శి యాళ్ల శివ, సత్తి బాలకృష్ణమూర్తి తదితరులు వున్నారు.