భీమిలీలో విజయఢంకా మోగించారు..
Ens Balu
2
Bheemili
2021-02-22 15:38:10
విశాఖజిల్లాలోని భీమిలీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు విజయఢంకా మోగించారంటూ సర్పంచ్ అభ్యర్ధులను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. సోమవారం భీమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపు సాధించిన సర్పంచ్ లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వానికి, పార్టీకి మంచి విజయాన్ని తెచ్చిపెట్టారన్నారు. 15 స్థానాలకి స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం గొప్పవిషయమన్నారు. ఈవిషయంలో నాయకులు, కార్యకర్తలు చేసిన క్రుషి మరువలేనిదన్నారు. చాలా చోట్ల టిడిపికి అభ్యర్ధులే లేరన్న మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభ్యర్ధులపై ప్రజలకున్న నమ్మకమే ఈ గెలుపునకు కారణమని పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ లు కార్యకర్తలతో కలిసి డప్పు వాయిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి నేరుగా సర్పంచ్ అభర్ధులను అభినందిస్తూ చైతన్య పరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో కూడా ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.