గిరి విద్యార్ధులు ఉన్నచదువులు చదవాలి..


Ens Balu
4
Paderu
2021-02-22 16:04:18

విశాఖ మారిక వలస లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ప్రతిభా కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఖర్గపూర్ ఐ ఐ టిలో మైనింగ్ విభాగంలో సీటు సాధించిన గిరిజన విధ్యార్దిని సందడి నీరజకు ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సోమవారం ఆయన కార్యాలయంలో ల్యాప్ టాప్‌ను బహూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్దులు ఉన్నతమైన స్దానాలను అధిరోహించాలన్నారు. ఐ ఐ టి సీటు సాధించిన గిరిపుత్రికను ఆయన అభినందించారు. మైనింగ్ ఇంజనీరింగ్‌కు మంచి డిమాండ్ ఉందని ఉన్నతమై ఉద్యోగాలు వస్తాయన్నారు. మైనింగ్ విభాగానికి ఉద్యోగ అవకాశాలు ఎక్కవన్నారు. బాగా చదువుకుని మన్యానికి మంచిపేరు తీసుకుని రావాలని సూచించారు. పెదబయలు మండలం పరదానపుట్టు గ్రామానికి చెందిన నీరజ ఐ ఐటి సీటు సాధించడం గిరిజన విద్యార్దులకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి. విజయకుమార్, గురుకుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు