పక్కాగా ఇంటింటికీ బియ్యం పంపిణీ..


Ens Balu
2
Paderu
2021-02-23 13:50:59

ఇంటింటికి బియ్యం పంపిణీ  పధకం పక్కాగా  అమలు చేయాలని పౌర సరఫరాల కమీషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిణీపై మంగళవారం అమరావతి నుంచి  జాయింట్  కలెక్టర్లు , ఐటీడీఏ పి.ఓలు, రెవిన్యూ  అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకులు పంపిణీ లో అలసత్వం వుండకుదన్నారు. సరుకులు పంపిణీపై  వాహన ఆపరేటర్ లకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ప్రతివాహనానికి  సంబంధించిన ఆపరేటర్ హెల్పర్ లను నియమించుకోవాలని స్పష్టం చేశారు. వాహనాలు ఆపరేటర్ లకు రూ.10 వేలు,హెల్పర్ కు రూ.5వేలు చెల్లిస్తామన్నారు.  ఉదయం 7.30 గంటలనుంచి సరుకుల పంపిణీ చేపట్టాలని సూచించారు. వచ్చే నెలనుంచి నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుని లబ్ధిదారులకు ముందుగా కూపన్లు పంపిణీ చేసి తరువాత నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ మాట్లాడుతూ 11 మండలాల్లో 144 మినీ వాహనాల ద్వారా పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ డిఓ కె.లక్ష్మీ శివజ్యోతి. పౌర సరఫరాల డి.టీలు చంద్రశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.