హౌసింగ్ లేవుట్లలో సమస్యలు పరిష్కరించాలి..


Ens Balu
5
Samarlakota
2021-02-23 17:21:15

పేదలందరికి ఇల్లు నిర్మాణ పనుల్లో లబ్ధిదారుల సమస్యలను హౌసింగ్ అధికారులు గుర్తించి నివేదికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి హౌసింగ్ అధికారులు ఆదేశించారు మంగళవారం సామర్లకోట మండలం జి. మేడపాడు, సామర్లకోట అర్బన్  కు సంబంధించిన పేదలందరికీ ఇల్లు నిర్మాణ పనులనుపరిశీలన, భూమి పూజ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ పాల్గున్నారు.ముందుగా జి మేడపాడు గ్రామంలో 372 మంది లబ్ధిదారులకు కేటాయించిన లేఔట్ లో 6 ఇళ్ల నిర్మాణ పనులకు కలెక్టర్,  హౌసింగ్ అధికారుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది అనంతరం సామర్లకోట అర్బన్ సంబంధించి 2258 లబ్ధిదారులకు కేటాయించిన పేదలందరికి ఇళ్ళులేఔట్ లో చేపట్టిన ఇళ్ళ నిర్మాణ పనులను, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి వాటర్ సప్లై ,కరెంటు , మెటీరియల్ స్టోరేజ్, సెక్కురిటీ, తదితర సమస్యలను నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు .హోసింగ్ నిర్మాణ సమస్యలను హౌసింగ్ అధికారులు నివేదిక తయారు చేస్తారని వాటిని సమావేశం చర్చించి  పరిష్కరిస్తామని లబ్ధిదారులకు తెలిపారు.  లబ్ధిదారులకు  ఇల్లు నిర్మాణానికి లక్ష 80 వేలు లబ్ధిదారులకు విడతలవారీగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ప్రతి ఒక్కరు ఇళ్ళునిర్మాణం చేపట్టాలని తెలిపారు. వాటర్ సప్లై, కరెంటు, పైప్ లైన్,  తదితర అంశాలపై, మున్సిపల్ హౌసింగ్ ,పబ్లిక్ హెల్త్ అధికారులతో కలెక్టర్ చర్చించారు అనంతరం కలెక్టర్ ఇంటి నిర్మాణానికి నిల్వ ఉంచే సిమెంట్ తూరలను,  దానికి అయ్యే ఖర్చు గురించి నిర్మాణం చేపట్టిన ఇంటి యజమాని  అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ వెంట జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి వీరేశ్వర ప్రసాద్, హౌసింగ్ ఇఇ బి. సుధాకర్ పట్నాయక్,  డి.ఈ.ఈ. ఆర్.ఎస్.కె.  రాజు, మున్సిపల్ కమిషనర్ శేషాద్రి హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు ,మున్సిపల్ డీఈ చదలవాడ రామారావు, టి పి ఎస్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు