దేశం తొంగిచూసేలా సీఎం జగన్ పాలన..
Ens Balu
3
Kotavuratla
2021-02-23 19:45:55
భారదేశ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన కొనసాగుతుందని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. మంగళవారం నియోజకవర్గలో గెలుపొందిన సర్పంచ్ లతో కోటవురట్ల మండలం రామచంద్రా పురం శ్రీపతిరాజు పామ్ హౌస్ లో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశం మొత్తం ఇపుడు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూస్తుందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉందన్నారు. పేద ప్రజల అభివృద్ధికి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 108 సర్పంచ్ లకు గాను వైఎస్సార్సీపీ అభ్యర్ధులు 86 స్థానాలు గెలుచుకోవడం ఆనందంగా వుందన్నారు. పార్టీ రహిత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులను గెలిపించుకున్న మనం త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకుని సీఎం వై ఎస్ జగన్ కు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన సర్పంచ్ లను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వైఎస్సార్సీపీ నేతలు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపిటిసి అభ్యర్థులు, ఈధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.