గ్రామాభివ్రుద్ధే లక్ష్యంగా పనిచేయాలి..


Ens Balu
3
Kasimkota
2021-02-24 18:18:06

 ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఫలితమే నేడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతు దారులు ఇంత పెద్దస్థాయిలో పంచాయతీ ఎన్నికల్లో విజయపతాకాలను ఎగురవేశారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ అన్నారు. బుధవారం కశింకోట మండలం కన్నురూపాలెంలో దంతులూరి శ్రీధర్ రాజు ఆధ్వర్యంలో మండలంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో  ఎమ్మెల్యే పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 59 పంచాయితీలలో 49 మంది పంచాయతీలను మన అభ్యర్థులే అఖండమైన మెజారిటీతో గెలుపొందడం శుభపరిణామమన్నారు. వారిలో గ్రామాభివృద్ధి కోసం 17 మంది యువకులకు సర్పంచి అభ్యర్థులగా గెలిపించి యువకులు కూడా రాజకీయాల్లో రావాలనే చైతన్యాన్ని కలిగించడం చెప్పుకోదగ్గ అంశమన్నారు.  గెలిచిన సర్పంచ్ అభ్యర్థులందరూ  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి  దంతులూరి దిలీప్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు, కశింకోట మండలం సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది,పెద్ద సంఖ్యలో మహిళలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.