రేపటి నుంచి నూకాలమ్మ ఆలయ వార్షికోత్సవం..
Ens Balu
3
Annavaram
2021-02-25 21:13:48
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలోని తారకరామ కాలనీలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మతల్లి ఆలయ ప్రధమ వార్షికోత్సవం మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ధర్మకర్త గంగరాజు తెలియజేశారు. గురువారం ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారిని గ్రామంలో ప్రతిష్టించి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో తీర్ధంతోపాటు, వివిధ సాంస్క్రుతిక కార్యక్రమాలు, నాద నీరాజనం, భజనలు, అమ్మవారి ఆలయంలో ఆఖరిరోజు అనగా అమ్మవారి పుట్టిన రోజు 28వ తేదిన భారీ అన్నసమారాధన కూడా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి ఆలయ ప్రధమ వార్షికోత్సవరంలో ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కమిటీ పూర్తినిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఉత్సవాల్లో అన్నవరంతోపాటు శంఖవరం మండల వాసులు, తూర్పుగోదావరి జిల్లాలోని భక్తులు కూడా పాల్గొని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించి వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదే సమయంలో అమ్మవారికి కానుకలు సమర్పించే వారు నేరుగా ఆలయంలోని ధర్మకర్తలను సంప్రదించవచ్చునని వివరించారు.