గుడిలో హుండీ దోచుకోబోయి పట్టుబడ్డారు.


Ens Balu
4
డౌనూరు
2021-02-26 08:44:52

విజయవాడకు చెందిన ఇద్దరు యువకులు ఒక బైక్ దొంగిలించి ఆపై మరో గుడిలో హుండీని దోచుకోబోయి స్థానికులకు పట్టుబడ్డారు. వివరాలు తెలుసుకుంటే కుమార్, మహేష్ అని చెప్పబడే ఈ ఇద్దరూ శుక్రవారం నర్సీపట్నం పక్కనే వున్న బలిఘట్టం గ్రామంలో ఒక మోటారు బైకుని దొంగిలించి అక్కడి నుంచి చింతపల్లి వెళుతూ..మార్గమధ్యలోని డౌనూరు గ్రామంలోని వినాయకుడి గుడిలో హుండీ పగుల గొట్టేందుకు విఫలయ యత్నం చేశారు. హుండీ పగులకొట్టే శబ్ధం విని గ్రామస్తులు ఆ ఇద్దరి యువకులను పట్టుకొని దేహశుద్ధి చేసి చెట్టుకి కట్టేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిని ప్రశ్నిస్తే తమది విజయవాడని, సన్ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజిలో చదువుతున్నామని చెప్పుకొచ్చారు. ఆపై కొన్ని పొంతన లేని మాటలు చెబుతుండటంతో వీరిని పోలీసులు వచ్చేంత వరకూ గ్రామంలోనే ఉంచేశారు. వీరి దగ్గర నుంచి బైకును స్వాధీనం చేసుకొని అందులో ఉన్న రికార్డులు పరిశీలించి అందులో ఉన్న వ్యక్తికి ఫోన్ చేయడంతో తన బైకు పోయిందని, తన పేరు గవిరెడ్డి శ్రీనివాస్ అని చెప్పారు. బైకును, దొంగలను గ్రామస్తులు పోలీసులకు అప్పగించినట్టు వివరించారు.