ఘనంగా పీటీ మాష్టారి ఉద్యోగ విరమణ..
Ens Balu
3
Annavaram
2021-02-27 22:16:57
అన్నవరంలోని శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి వారి దేవస్థానం సంస్క్రుతోన్నత పాఠశాలలో పీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మొగిలి చక్రరావు మాష్టారి ఉద్యోగ విరమణ శనివారం పాఠశాల ఆవరణలో విద్యార్ధులు ఘనంగా నిర్వహించారు. మాష్టారి దంపతులను ప్రత్యేక కుర్చీపై కూర్చోబెట్టి ఆయన దగ్గర క్రీడల్లో శిక్షణ పొందిన పూర్వ విద్యార్ధులతోపాటు, ప్రస్తుత విద్యార్ధులు కూడా తమ గురువుకి పాదాభివందనం చేశారు. ఈ పాఠశాలలో చదువుకున్నవారంతా ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ మాష్టారి ఉద్యోగవిరమణ సంగతి తెలుసుకొని పాఠశాలకు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన వద్ద శిక్షణ పొందిన విద్యార్ధులంతా నేడు తమ పిల్లలతో వచ్చి ఆఖరిరోజు తనను కలుసుకోవడం చాలా ఆనందంగా వుందని పీటీ మాష్టారు చక్రరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజుతో తనకి ఈ పాఠశాలకి రుణం తీరిపోయినప్పటికీ ఎందరో విద్యార్ధులను ఒకేసారి చూసే అవకాశం, ఆనందం తనకి దక్కిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం గ్రామానికి చెందిన గజివిల్లి సిస్టర్స్ మత్స్య, మణిమాల, నాగసత్యశిరీషలు కూడా పాల్గొని మాష్టారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అధిక సంఖ్యలో విద్యార్ధులు,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.