నూకాలమ్మ గుడిలో విజయవంతమైన ఏకాహాం..


Ens Balu
4
Annavaram
2021-02-28 09:51:40

అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి ఏకాహం(24 గంటల భజన) ఆదివారం ఉదయం 6గంటలతో పూర్తయింది. ఎనిమిది భక్తమండలి బ్రుందాలు మూడు గంటల చొప్పున 24 గంటల పాటు వాయిద్యాలు వాయిస్తూ అమ్మవారికి గాన నీరాజనం సమర్పించారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లూ చేశారు. అమ్మవారి ఆలయ వార్షికోత్సవరం సందర్భంగా ఈరోజు ఆలయంలో భారీ అన్నసమారాధాన ఉదయం 11 నుంచి ప్రారంభిస్తామని ధర్మకర్త గంగరాజు తెలియజేశారు. ఉదయం 5 గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అశేషంగా వస్తున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అన్నవరం గ్రామంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.