ఘనంగా నూకాలమ్మ ఆలయ వార్షికోత్సవం..
Ens Balu
3
Annavaram
2021-02-28 23:15:31
అన్నవరంలోని బిసీకాలనీ కొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ధర్మకర్త గంగరాజు కుటుంభం ఉదయం ఐదుగంటలకు తొలిపూజ చేసి అమ్మవారిని మోల్కొలిపారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన అమ్మవారికి భక్తులకు ప్రత్యేక పూజలు చేసి, దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదానం కార్యక్రమంలో సుమారు మూడువేల మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉదయం ఆరుగంటల నుంచి ప్రత్యేక భజన కార్యక్రమాలు 11గంటల వరకూ నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించి. సాయంత్రం అమ్మవారి గాన నీరాజనం ప్రత్యేక హారతి సర్పించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మహిళా భక్తులకు గాజులు, పూవులు, కుంకుమను అందించారు ఆలయ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సుమారు 35 మంది యువకులు మూడు రోజుల పాటు నిర్వహించి ఉత్సవాల్లో కీలక పాత్ర వహించి కార్యక్రమాలను విజయవంతం చేశారు.