ఆ ఏఈని సస్పెండ్ చేయండి..కలెక్టర్


Ens Balu
2
Tuni
2021-03-04 22:31:43

నాడు-నేడు పనులను  నాణ్యతా ప్రమాణాలు లేకుండా, నిబంధనలు,సరైన పర్యవేక్షణ పాటించకుండా నిర్వహించినందుకు గాను తుని సమగ్ర శిక్ష విభాగం సైట్ ఇంజనీరు వి.రాజేంద్రప్రసాద్ సస్పెన్షన్ కు జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ తుని మండలం, డి.పోలవరంలో జరిపిన పర్యటనలో గ్రామంలోని జడ్పి హైస్కూల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు.  పాఠశాల భవనాల నిర్మాణ పనులను నాణ్యతలేని సామాగ్రితో, ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు ఆయన గమనించి, వాడుతున్న మెటిరీలియల్ గురించి ఆయన కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు. పనులు నాసిరకంగా జరుగుతున్నా పట్టించుకోకుండా, పర్యవేక్షణ నిర్లక్ష్యం చేసిన  సైట్ ఇంజనీరు రాజేంద్రప్రసాద్  బాద్యతా రాహిత్యం పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసి, అతని సస్పెన్షన్ కు ఆదేశించారు. అలాగే  పనుల్లో నిర్థేశించిన మెటీరియల్ కాకుండా నాసిరకం సిమ్మెంటు, ఇసుక వాడుతున్న కాంట్రాక్టర్ పై కూడా చర్యకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. అలాగే ప్రధానోపాద్యాయుడు, స్కూల్ కమిటీ  నాణ్యత లేకుండా పనులు జరుగుతున్నా అధికారుల దృష్టికి తేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.   ప్రభుత్వం విద్యా వసతుల అభివృద్దికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనులలో అవకతవకలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు.  
సిఫార్సు