నెలాఖరు నాటికి నిర్మాణాలు పూర్తికావాలి..
Ens Balu
3
Kotananduru
2021-03-04 22:33:32
రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్ భవనాలు, సచివాలయ నూతన భవనాలను మార్చి చివరినాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కోటా నందూరు మండలం బిల్వా నందూరు గ్రామంలో నిర్మిస్తున్నరైతు భరోసా, హెల్త్ కమ్యూనిటీ సెంటర్ల్, సచివాలయాల భవాన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, ఈ భవనాలను మార్చి చివరినాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్ ఆర్ పేటలో ఇంటింటికి రేషన్ పంపిణీ పధకంలో భాగంగా రేషన్ పంపిణీ వాహనాన్ని సందర్శించి పంపిణీ చేయు ప్రక్రియను ఆలాగే పంపిణీ లో వున్న సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కోటానందూరులోను బీమావరపుకోటలో వైస్సార్ చేయూత పథకం కింద మేకలు, పశువులు, గొర్రెలు కొనుగోలుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోబ్యాంకు ల ద్వారా అందిస్తున్న ఒక్కకరికి రూ.18600 చొప్పున మంజూరు చేసిన మంజూరు పత్రాలను కలెక్టర్ చేతులు మీదుగా పంపిణీ చేశారు. భీమవరపు కోట లో జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల లో మధ్యాహ్నం భోజన పధకాన్ని పరిశీలించి, కలెక్టర్ భోజన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం)జి. రాజకుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్టీ.శ్రీనివాసరావు,ఆర్డిఓ ఎస్. మల్లి బాబు, తహసీల్దార్ల ఎంపీడీఓ,తదితరులు పాల్గొన్నారు.