సమగ్ర భూ సర్వపై అత్యాధునిక శిక్షణ..


Ens Balu
3
Gokavaram
2021-03-05 08:23:50

సమగ్ర భూ సర్వేపై బేస్ స్టేషన్ శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా సర్వేయర్ ఎం.మోహనరావు తెలియజేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఈమేరకు సర్వేయర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ముందుగా కొంతమంది సర్వేయర్లకు అత్యాధుని సాంకేతిక వ్యవస్థపై శిక్షణ ఇచ్చిందని వారితో అన్ని ప్రాంతాల్లో బేస్ స్టేషన్ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా శిక్షణ పొందిన వీర్ల సురేష్, బి.వీరేంద్రల ఆధ్వర్యంలో సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సర్వేయర్లకు శిక్షణ పూర్తవగానే ఎవరి మండలాల్లో వారు ఈ యొక్క భూ సర్వే ప్రభుత్వ ఆదేశానుసారం ప్రారంభిస్తారని చెప్పారు. కొత్తసర్వేయర్లకు శిక్షణ ఇవ్వడానికి టెక్నాలజీపై బాగా అవగాహన ఉన్న యువ సర్వేయర్లను ప్రభుత్వం తొలి శిక్షణకు ఎంపికచేసిందని వివరించారు. వారే మిగిలిన వారికి శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. శిక్షణలో కొత్తగా విధుల్లోకి చేరిన సర్వేయర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల సర్వేయర్ పి.సత్యన్నారాయణ, వివిధ మండలా సర్వేయర్లు పాల్గొన్నారు.
సిఫార్సు