మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాలి..


Ens Balu
2
Narsipatnam
2021-03-07 16:11:21

మున్సిపల్ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య స్పష్టం చేశారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో  జోనల్అధికారులకు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, మొబైల్ టీమ్స్, పోలీస్, సెక్రటేరియట్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణ పై  సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయం తో పనిచేస్తూ  మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.ఈ మూడు రోజులు అత్యంత కీలకమని జోనల్ అధికారులు, మొబైల్ , సర్వెలేన్స్ టీంలు చాలా జాగ్రత్తగా విధులను నిర్వహించాలన్నారు. డబ్బు, మద్యం రవాణా ఎక్కడైనా జరుగుతున్నట్లు దృష్టికి వస్తె వెంటనే కంట్రోల్ రూం నంబర్లకు కంప్లైంట్ చేయాలన్నారు. ఫిర్యాదు అందిన ఆరు గంటల లోపల క్లియర్ చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ల వద్ద నిఘా పెంచాలన్నారు. ప్రచార ర్యాలీ లను వీడియో తీయాలన్నారు. మోడల్ కోడ్ ను ఉల్లంఘించే వారిపై చర్యలు చేపట్టాలన్నారు.  స్కూల్స్, దేవాలయాల వద్ద లౌడ్ స్పీకర్లు వాడరాదన్నారు. సెక్రటేరియట్ సిబ్బంది ఓటర్ల స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని  పూర్తి చేయాలన్నారు. ఓటర్లకు సంబంధించి ఇంట్లో  అందుబాటులో లేక పోవడం, ఇళ్లు మారడం, డెత్స్ లాంటి వివరాల జాబితాను తయారు చేసి వెంటనే అందజేయాలన్నారు. ఓటర్లకు ఓటు పై అవగాహన పెంచి వారు ఓటు హక్కుని వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచేవిధంగా  చూడాలన్నారు. వాలంటీర్లు  ఎన్నికల ప్రచారంలో పాల్గొన రాదని, ఎవరి మీదన్నా ఫిర్యాదు వస్తె  ఎన్నికల నియమావళి  ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  ఈ నెల 8 వ తేదీ సాయంత్రం 5 గంటల కల్లా ఎన్నికల ప్రచారం ముగుస్తుందని, అదే విధంగా లిక్కర్ షాప్స్ మూసి వేయాలన్నారు. ఈనెల 9వ తేదీన ఎన్నికల సామాగ్రిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంపిణీ చేయనున్న నేపథ్యంలో త్రాగు నీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.  ఈ సమావేశంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మరియు మునిసిపల్ కమీషనర్ ఎన్ కనకారావు, పట్టణ సి ఐ స్వామి నాయుడు హాజరయ్యారు.  ఫిర్యాదులకు సంబందించి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని   ఫిర్యాదులను నమోదు చేసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  84650 13255,  089322  95588  నంబర్లను 24/7 అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.