భక్తులకోసం మంచి ఏర్పాట్లు చేయాలి..


Ens Balu
3
పాడేరు
2021-03-08 18:52:50

పాడేరు డివిజన్ లోని  మత్స్యగుండం ఆలయం వద్ద 11న మహాశివరాత్రి సందర్భంగాభక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు  చేస్తున్నట్లు ఆర్డీఓ కె.లక్ష్మీ శివ జ్యోతి తెలిపారు. సోమవారం మత్స్యగుండం ఆలయంలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.  శివుని గుడి వద్ద  దర్శనము చేసుకునే భక్తులకు క్యూ లైన్ లో పంపించాలని అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆమె అధికారులకు తెలిపారు. స్నానాలకు వెళ్లేవారకి ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటుచేసేమని గ్రామీణ మంచినీటి శాఖా అధికారులు మంచినీరు సరఫరా చేస్తున్నట్లు , ఆర్టీసి వారు 20 బస్సులు నడుపుతారని ఆమె తెలిపారు. 3రోజులు విద్యత్ కి అంతరాయం కలుగకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆలయానికి 5 మీటర్ల దూరాన వాహనాలను ఆపివేయాలని తెలిపారు. తాహశీల్దార్ వై.బి.కోటేశ్వరావు ,ఇఒఆర్డి ఉమామహేశ్వరరావు ,ఆర్ఐ నల్లన్న  పాల్గొన్నారు.
సిఫార్సు