మహాశివ రాత్రి ఉత్సవాల్లో లిఫ్ట్ సేవలు..


Ens Balu
2
Balighattam
2021-03-11 19:22:12

దక్షిణ కాశీగా వెలుగొందుతున్న నర్సపట్నంలోని  బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం మహా శివరాత్రి పుజలు, దర్శనాలు ఘనంగా నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో వచ్చిన భక్తుల సౌకర్యార్ధం లిఫ్ట్ రూరల్ డవలప్మెంట్ వెల్ఫెర్ సొసైటీ ఆధ్వర్యం లో  ఉచితంగా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్స్, పులిహోర ప్రసాదం వితరణ చేపట్టారు. ఎండలు అధికంగా కాస్తుండటంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందుల పంపిణీ కూడా చేపట్టింది. ఈ కార్యక్రమం లో సంస్థ గౌరవ అధ్యక్షుడు ఐ.సుధాకర్, అధ్యక్షురాలు ఐ.అశ్వని, కార్యదర్శి ప్రసాద్ , సభ్యలు అడిగర్ల సతీష్,పృధ్విరాజ్,బి.శివ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు