అన్నివర్గాలు మెచ్చిన పార్టీ వైఎస్సార్సీపీ..
Ens Balu
2
Golugonda
2021-03-12 13:05:09
దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన వైఎస్సార్సీపీ నేడు ప్రజా ప్రభుత్వంగా విశేషంగా సేవలు అందిస్తుందని వైఎస్సార్సీపీ మండల నాయకులు గిరిబాబు అన్నారు. శుక్రవారం గొలుగొండ మండలం చీడిగుమ్మలలో వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డా.వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భవించి నేటికి 11 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తయిదన్నారు. తమ ప్రియతమ నేత యువ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అడుగుజాడల్లోనే తామంతా పనిచేస్తూ పయనిస్తామని ప్రకటించారు. వచ్చే మూడు దఫాలు వైఎస్ జగనన్ననే సీఎం ని చేసుకుని ప్రజాసేవకులగా ప్రజలతోనే ఉంటామని చెప్పారు. అన్ని వర్గాలు మద్దతు ఇచ్చే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని కొనియాడారు. ఈ కార్యక్రమం లో జగన్ యువసేన ,వార్డుమెంబర్లు,పార్టీ పెద్దలు పాటు శాంతారామ్, పత్తి రమణ, లెక్కల అప్పలనాయుడు, మర్రి అప్పలనాయుడు, గండి శ్రీను, ఇటంశెట్టి రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.