వరదల సమాచారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్...


Ens Balu
1
Tandava
2020-08-20 20:46:19

విశాఖజిల్లాలో అధిక వర్షాల నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా తెలియజేసేందకు ప్రత్యేక కంట్రోల్  రూం ఏర్పాటు చేసినట్టు  కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాండవ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఆయన గురువారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరదల నేపథ్యంలో ఇన్ఫ్లో కొనసాగుతోందన్నారు. దీని గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం  379.1 అడుగులకు చేరిందన్నారు. దీనివల్ల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దీంతో పాటు నీటిని విడుదల చేసే సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అధికారులను ఆదేశించామన్నారు.