నర్సీపట్నం డిగ్రీ కాలేజీలో ఎలక్షన్ కౌంటింగ్..
Ens Balu
2
Narsipatnam
2021-03-13 18:56:05
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేశామని జిల్లా అదనపు ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య తెలిపారు. శనివారం అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మరియు మున్సిపల్ కమీషనర్ ఎన్ కనకారావు, పట్టణ సి ఐ స్వామి నాయుడు తో కలిసి కౌంటింగ్ హాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ ఉండేలా అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి రెండు జనరటర్ల ను సిద్దం చేయడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా వీడియో తీయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ అధికారులు,సిబ్బంది ఉదయం 6.30 గం ల కల్లా వారికి కేటాయించిన టేబుల్స్ వద్ద సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎనిమిది గంటలకు ముందుగానే పోస్టల్ బ్యాలెట్ లను కౌంటింగ్ కు సిద్దం చేయడం జరుగుతుందన్నారు. వెంటనే ఓట్ల లెక్కింపు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు.