యలమంచిలి మున్సిపాలిటీపై YSRCP జెండా..


Ens Balu
3
Yalamanchili
2021-03-14 11:22:38

విశాఖపట్నం జిల్లా యలమంచిని మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో 25 వార్డులు ఉండగా అత్యధికంగా 23 వార్డులను వైఎస్సార్సీపీ గెలుపొంది మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు. దీనితో యలమంచిలి  ఎమ్మెల్యే కన్నబాబురాజు టార్గెట్ కంప్లీట్ అయ్యినట్టు స్పష్టమైంది. మిగిలిన రెండు స్థానాలు మాత్రమే వైఎస్సార్సీపీ ఓడిపోయింది. అయిన్నప్పటికీ యలమంచిలిలో ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. విశాఖజిల్లాలో ప్రధానంగా టిడిపి ప్రత్యేకంగా ద్రుష్టిసారించినా ఫలితం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అభ్యర్ధులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని తమ సత్తానుు చాటారు. కనీసం టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా ఈ మున్సిపాలిటీలో దక్కకపోవడం చర్చనీయాంశం అవుతుంది. ఈ నియోజకవర్గంలో ఆది నుంచి ఎమ్మెల్యే కన్నబాబురాజుకి పూర్తిస్థాయిలో పట్టువుంది. అనుకున్నట్టుగానే సీఎంకి మున్సిపాలిటీని గిఫ్ట్ గా ఇస్తామన్న ఎమ్మెల్యే ప్రకటన నిజమవడంతో నియోజవర్గంలో సంబాలు అంబారాన్ని అంటుతున్నాయి. పార్టీ క్యాడర్ లో ఫుల్ జోష్ నెలకొంది...
సిఫార్సు