సమావేశానికి తప్పక హాజరు కావాలి..
Ens Balu
2
Mandapeta
2021-03-14 18:37:59
తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మున్సిపాలిటీ పాలక మండలికి ఈ నెల 18వ తేదీన ఉ. 11 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని జెసి రాజకుమారి పేర్కొన్నారు. మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్ధులకు ఆరోజు సమావావేశానికి హాజరు కావాల్సిందిగా తెలిపే నోటీసులను అభ్యర్ధులకు ఆమె నేరుగా అందించారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి మండపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎస్.పి. అద్నాన్ నయీమ్ అస్మి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. 18వ తేదీన మండపేట మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా మండపేట మున్సిపాలిటీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని జేసి వివరించారు.