పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శం..
Ens Balu
3
Paderu
2021-03-16 17:40:09
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అహర్నిసలు కృషిచేసి ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకోవడానికి ఆమరణ నిరాహారదీక్ష చేసిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని పాడేరు ఐటిడిఎ పిఓ డా.సలిజాముల వెంకటేశ్వర్ కొనియాడారు. మంగళవారం స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో 120 వపొట్టి శ్రీరాముల జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి అయిన మహా పురుషుడు అన్నారు. ఆంధ్రులకు ప్రాంతీయ భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు కారణభూతుడైనవాడు మహాత్మ గాంధీ బోధించిన సత్యం,అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటిడిఎ పరిపాలనాధికారి కె.నాగేశ్వర రావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేమని అన్నారు. డిడి ట్రైబల్ వెల్ఫేర్ విజయకుమార్,డిఎమ్&హెచ్ఒ కె.లీలాప్రసాద్, కాఫీ ఏడి రాధాకృష్ణ, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ కృష్ణారావు మరియు ట్రైబల్ వెల్ఫేర్,పంచాయతీ రాజ్ , ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.