నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికి పంపిస్తా..


Ens Balu
3
Makkuva
2021-03-16 18:37:52

ముఖ్య మంత్రి వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ  ప్లస్ పథకాని నీరుగారిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని పార్వతీపురం ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి  ఆర్ కూర్మనాథ్ హెచ్చరించారు.  మంగళవారం మక్కువ మండలం శంభరలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.  ముందుగా రికార్డులు పరిశీలించారు  రికార్డులు ఆన్ని సక్రమంగా నిర్వహించక పోవడం, పంపిణీ చేసిన వస్తువులకు సంబంధించి రశీదులు లేకపోవడం పై అలాగే పిల్లల హాజరు పట్టి పరిశీలించారు మొత్తం పిల్లలు 23 మందికి గాను 20 మంది హాజరు అయినట్లు రిజిష్టర్లో నమోదు అయి ఉండగా కేంద్రంలో 8 మంది పిల్లలు ఉండడం పై  ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో లబ్ధిదారులు వచ్చి మాకు ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ పోషణ ప్లస్ సరుకులు అందటం లేదని ప్రాజెక్ట్ అధికారి వారికి పిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ప్రాజెక్ట్ అధికారి అంగన్వాడీ నిర్వహిస్తున్న సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి తదుపరి క్రమశిక్షణా చర్యలు చేపట్టలని సి.డి.పి.ఓ కి ప్రాజెక్ట్ అధికారి  ఆదేశించారు.అనంతరం ప్రాజెక్ట్ అధికారి మక్కువ మండలం శంభర జిల్లా పరిషత్ హైస్కూల్ మధ్యాహ్న భోజన నిర్వహణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా రికార్డులు పరిశీలించారు రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం పిల్లలతో కలసి భోజనం చేశారు . నాణ్యత లేని గుడ్లు వినియోగించడం, భోజనం రుచికరంగా లేకపోవడం పై ఆగ్రహించిన ప్రాజెక్ట్ అధికారి మీ ఇంటిలో ఇలాగేనా తింటారు ఇటువంటి రుచిలేని భోజనం, నాణ్యత లేని గుడ్లు మీరు తింటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంతరం భోజన నిర్వాహకులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.    
సిఫార్సు