పరిశోధనలపై అవగాహన అవసరం..


Ens Balu
2
Sankhavaram
2021-03-16 18:46:39

విద్యార్ధులకు పాఠశాల దశ నుంచే పరిశోధనలపై అవగాహన పెంచుతూ వారిలో ఉత్తేజాన్ని నింపాలని తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్త  శివ ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం శంఖవరం జిల్లాపరిషత్ పాఠశాలలో అంతరిక్ష పరిజ్ఞానం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా  విద్యార్థులకు ఇస్రో రాకెట్ ప్రయోగాలు, చంద్రయాన్, శాటిలైట్ అంతరిక్ష ప్రయోగాలు వాటి పై పిల్లలు అంతరిక్ష విజ్ఞానం పై ఆసక్తిని కలిగించే వివిధ అంశాల ఆయన అవగాహన కల్పించారు. విద్యార్ధులు సెల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి పరిశోధనలు, ఇస్రో నిర్వహించే కార్యక్రమాల కోసం తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా వివేకానందుడు, ఏపీజే అబ్దుల్ కలాం గురించి చెబుతూ విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాద గోపాలకృష్ణ,లింగేశ్వర రావు, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు వెంకటేశ్వర రావు,వెంకటరావు, అప్పల రాజు, విద్యార్ధులు పాల్గొన్నారు.
సిఫార్సు