బాధితులకు నష్టపరిహారం అందుతుంది..
Ens Balu
2
Hukumpeta
2021-03-17 19:15:56
పాడేరు ఐటిడిఏ పరిధిలోని హుకుంపేట మండలంలో రైతులతో చర్చించి - వారు నష్ట పోయే భూములకు ప్రభుత్వం వారు నిర్ణయించిన విధముగా నష్టపరిహారం చెల్లిస్తామని రెవిన్యూ డివిజనల్ అధికారిణి కె.లక్ష్మి శివ జ్యోతి తెలియజేశారు. బుధవారం ఈ మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గిరిపుత్రుల నుంచి వివరాలతో పాటు ఏ స్థాయిలో భూములు కోల్పోతున్నారో వివరాలు అడిగితెలుసుకున్నారు. మండంలోని గ్రామాలు, ప్రాంతాలు, స్థల విస్తీర్ణం ఆధారంగా నష్టపరిహారం అందిస్తామని ఆర్డీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వై.బి కోటేశ్వరరావు, ఎల్. ఆర్. డి. టి. - బి.అప్పల నాయుడు,మూర్తి ఆర్. ఐ - నల్లన్న, విఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.