రైతులకు తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తాం..
Ens Balu
2
Hukumpeta
2021-03-18 16:14:18
హుకుంపేట మండలం బర్మంగూడ,కుంతిలి,పాటిమామిడి జాతీయ రహదారి నిర్మాణంలో గిరి రైతులకు నష్టపరిహారం తప్పనిసరిగా చెల్లిస్తామని ఆర్డీఓ కె.లక్ష్మీ శివజ్యోతి స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు ఆయా గ్రామాలకు చెందిన 20మంది రైతులతో హకుంపేట తాహశీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, రైతులెవరూ నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధర అందిస్తామని ఆమె తెలిపారు. ఈ విషయం పై రైతులు సమ్మతి తెలియజేసి సానుకూలంగా స్పందించారని ఆమె అన్నారు. ఎవరికీ నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి సమ్మతిని స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశం లో తహసీల్దార్ - వై. వి కోటేశ్వరరావు, బి. అప్పల నాయుడు,సి. సహాయకులు, టి.రామ్మూర్తి, ఆర్ఐ నల్లన్న, వీఆర్వో సత్యారావు, సర్వేయర్ - కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.