గిరిజనులకు ఆధార్ సేవలు చేరువ కావాలి..
Ens Balu
6
హుకుంపేట
2021-03-19 17:21:07
హుకుంపేట మండలం లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రం ద్వరా గిరిజనులకు మరింతగా ఆధార్ సేవలు అందించాలని పాడేరు ఆర్డీఓ కె. లక్ష్మి శివ జ్యోతి కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఆధార్ కేంద్రం ద్వారా విద్యార్ధులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తరువాత ప్రజలకు అందుబాటులో సేవలను ఉంచాలన్నారు. కేవలం రోజుకు 30 దరఖాస్తులు మాత్రమే ఉండేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం హుకుంపేట తహశీల్దార్ కార్యాలయములో హుకుంపేట మండలం ములియాపుట్, ముంచింగ్ పుట్, హుకుంపేట గ్రామస్థుల రైతుల తో జాతీయ రహదారి కి సంబంధించిన నష్ట పరిహారం కోసం ఆమోద పత్రాలను తీసుకున్నారు. ఈ కార్య క్రమం లో తాహశీల్దార్ వై .వి. కోటేశ్వరరావు ,ఎల్.ఆర్.డిటి అప్పలనాయుడు పాల్గొన్నారు.