సెల్ సిగ్నల్ పడక కొండలు ఎక్కుతున్నాం దొరా...


Ens Balu
1
Pedabayalu
2020-08-23 15:03:05

విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలంలో సెల్ సిగ్నల్ లేక కొండలు,  గుట్ట లపైకి వెళ్లాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య విశాఖపట్నం జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధక్రిష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బొంగరం, లిగేంటి, గోమంగి, గుల్లేలు, పోయి పల్లి, పంచాయతీలలో సెల్ టవర్ , సెల్ సిగ్నల్ లేక, పది పదిహేను కిలోమీటర్లు దూరం  ఈ కేవైసీ చేసుకోవడానికి  డ్వాక్రా మహిళలు  పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. వారి సమస్యలపై తక్షణమే అధికారులు స్పందించి సెల్ సిగ్నల్ మెరుగు పరచడం కానీ, ఏపీ ఫైబర్ నెట్ సెంటర్లు ఏర్పాటుగానీ చేయాలన్నారు.  డ్వాక్రా మహిళలు  కొద్దిమందికి, లిస్టులో పేర్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. ఆదివాసుల కష్టాల పై అధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.