సతీష్ బాబు ప్రాణత్యాగం వృధాకాదు..కుమార్ రాజా


Ens Balu
5
2020-06-21 14:48:08

భారత్-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన భరతమాత ముద్దు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు ప్రాణత్యాగం వ్రుధాగా పోనివ్వమని డిసిసిబి డైరెక్టర్ సిహెచ్ కుమార్ రాజా అన్నారు. అన్నవరం శ్రీ సత్యగణపతి తోపుడు బండ్లు మరియు కాశీ తాళ్ల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి పాదాల చెంత యుద్ధంలో వీరమణం పొందిన సంతోష్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతి గర్వించదగ్గ అని కొనియాడారు. దేశంలో ప్రతీ పౌరుడూ చైనా దురంహకారాన్ని తిప్పికొట్టాలన్నారు. చైనా వస్తువులను, మొబైల్ యాప్ లను నిషేధించాలని అన్నారు. తోపుడు బండ్ల వర్తకులకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ టౌన్ ప్రెసిడెంట్ బొమ్మిడి సత్యన్నారాయణ, సంఘం అధ్యక్షులు తాటిపాక శ్రీను, సభ్యులు ప్రసాద్, నాని, శ్రీను తదితరులు పాల్గొన్నారు.