పూర్తి అవగాహనతోనే కరోనా నియంత్రణ..


Ens Balu
4
అనంతగిరి
2021-04-25 11:58:50

కోవిడ్ 19 వైరస్ పట్ల పూర్తి అవగాహన పెంచుకొని నిబంధనలను పాటించడం ద్వారా వైరస్ ను  నియంత్రించడానికి వీలు పడుతుందని ప్రమిస్ ల్యాండ్ ట్రైబల్ వెల్పేర్ అసోసియేషన్ డైరెక్టర్ పి.రమణ అన్నారు. శనివారం  అనంతగరి మండలం బిడ్డచెట్టు కాలనీలో సమిధ సంస్థతో కలిసి ఆయన గిరిజన యువతకు  కరోనా వైరస్, నియంత్రణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనతో కూడిన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సంస్థ  డైరెక్టర్ డి.వీరభద్రరావుతో కలిసి మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునన్నారు. అనవసరంగా జన సమూహంలో తిరగకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. యువత గ్రామాల్లోని వారికి ఈ వైరస్ పట్ల అవగాహన కల్పించడం ద్వారా గ్రామాల్లోకి ఈ వైరస్ ను రానీయకుండా చేసుకోవచ్చునని తెలియజేశారు. వైరస్ వచ్చిన తరువాత జాగ్రత్తలు తీసుకునే కంటే..వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని గిరి యువతకు అవగహాన కల్పించారు. అనంతరం యువతతో కలిపి గ్రామంలో ర్యాలీ నిర్వహించి, శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నవారికి సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బుదిరాజ్, సింహాద్రి, నాగమణి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు