సీఎస్ఆర్ నిధులతో ఆసుపత్రులకు పరికరాలు..పీఓ


Ens Balu
3
2020-08-26 17:39:20

 గిరిజన ప్రాంతాలకు వైద్య నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తున్నట్టు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి  తెలిపారు. పసిపిల్లలకు వైద్య నిమిత్తం  పరికరాలు పంపిణీ చేశారు. ఈసందర్గౌభంగా ఆమె మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  ఏజెన్సీ ప్రాంతంలో మందల కొనుగోలు అయ్యే ఖర్చు  మంజూరు చేయటం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా రోగులు చోడవరం, విశాఖపట్నం వెళ్లకుండా ఇక్కడే వారికి వైద్య సేవలు అందేటట్లు చూడాలని తెలిపారు. ప్రస్తుతపరిస్థితుల్లో కరోనా ఎక్కువగా ఉన్నందున దానిని అధిగమించడానికి ఆసుపత్రులలో మందులు ఎక్కువగా వున్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేనందున రోగులు డోలీలద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలకు వస్తున్నారని కాని ఇప్పుడు రోడ్లు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కరోనా సమయం లో వైద్యులు విరామం లేకుండా శ్రమిస్తున్నారని ఆమె వైద్యులను అభినందించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ సలిజాముల వెంకటేశ్వర్  మాట్లాడుతూ వైద్య పరికరాలు కొనుగోలు చేయుటకు సి.యస్.ఆర్. నిధులు మంజూరు చేస్తున్నామని ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ నిధులు 10లక్షలు మంజూరు అయ్యాయని 7 లక్షలు ఈ పరికరాలు కొనుగోలు చేయుటకు అయ్యాయని మరియు 3 లక్షలు ఆసుపత్రుల అభివృద్ధి కొరకు మంజూరు చేశామని అన్నారు. రోగులను తీసుకెళ్ళడానికి 14 అంబులెన్స్ లను కొత్త గా కొని వాడుతున్నామని అన్నారు.