జిఓ-2లో అంశాలపై స్పష్టత ఇవ్వండి..
Ens Balu
4
శంఖవరం
2021-05-01 07:52:45
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఓనెంబరు 2 లో కొన్ని అంశాల్లో తమకు స్పష్టత ఇవ్వాలని కోరుతూ గ్రేడ్5 సచివాలయ కార్యదర్శిలు ఎంపీడీఓ జె.రాంబాబుని కలిసి వినతిపత్రం సమర్పించారు. శంఖవరం మండలంలోని గ్రామసచివాలయ కార్యదర్శిలు ఎంపీడీఓ కలిసి జీఓ2 విషయంలో ఎదురవుతున్న పలు సమస్యలను ఆయన ద్రుష్టికి తీసుకెళ్లారు. వీఆర్వోలకు డిడిఓలుగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, క్లస్టర్ పరిధిలోని గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శిల విధులేంటో కూడా తెలియజేయాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు. అదేవిధంగా ఒక పంచాయతీకి ఒక సెక్రటరీని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. తమకు నిర్ధిష్ట అధికారాలు ఇవ్వడం ద్వారా ప్రజలకు సచివాలయాల పరిధిలో మరింతగా సేవలు అందించడానికి వీలుపడుతుందనే విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లాలని ఎంపీడీఓను కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శిలు కోడూరి శంకరాచార్యులు, సత్యవెంకటేష్, వీరబాబు, శివరామక్రిష్ణ, సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.