పివిజి రాజు ఆశయాలే మాకు స్ఫూర్తి..


Ens Balu
4
సింహాచలం
2021-05-01 08:26:48

దివంగత మహారాజు పూసపాటి విజయరామ గజపతిరాజు ఆశయాలే తమకు స్పూర్తి అని శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయం  అనువంశిక ధర్మకర్త, ఛైర్ పర్సన్ సంచయిత అన్నారు. పీవీజీ 97వ జయంతి సందర్భంగా గోశాలలో ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్శన్  సంచయిత మాట్లాడుతూ, ఆయన సింహాచలం దేవస్థానానికి 100ఏళ్లకు పైగా దేవస్థానం చైర్మన్, ధర్మకర్తగా ఎంతోబాగా పనిచేశారని కొనియాడారు. మా తాత మహారాజ విజయరామ గజపతి ఒక గొప్పదాత, విద్యావేత్త, మానవతావది అని కొనియాడారు. ఆయన దూరదృష్టి స్ఫూర్తిని స్మరించుకుంటూ ముందుకు సాగుతామన్నారు. కరోనా కష్టకాలంలోనూ శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి పూజలకు ఎలాంటి లోటు రాకుండా, నిబంధనల మేరకు భక్తులను అనుమతిస్తున్నామని చెప్పారు. ఈఓ సూర్యకళ  పీవీజీ రాజు సేవలను కొనియాడారు. పివిజి రాజు కోరుకొండ సైనిక స్కూల్ కు  వెయ్యి ఎకరాలకుపైగా దానం చేయడంతో దేశంలోనే తొలి సైనిక స్కూల్ ఏర్పడింది. కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సిఫార్సు