YSR సంపూర్ణ పోషణ సద్వినియోగం చేసుకోవాలి


Ens Balu
1
శంఖవరం
2021-05-04 06:59:43

వైఎస్సార్ సంపూర్ణ పోషణ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శి జిఎన్ఎస్ శిరీష అన్నారు. మంగళవారం శంఖవరంలోని అంగ్వాజీ-4 పరిధిలోని  బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ఎం.రాజ్యలక్ష్మి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు