పాడేరు కుమ్మరిపుట్టు యూత్ శిక్షణా కేంద్రంలో రెండు వందల పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ఆర్ డి ఓ కె. లక్ష్మి శివజ్యోతి చెప్పారు. ఈనెల 5 వతేదీ నుంచి కోవిడ్ కేర్ సెంటర్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మంగళవారం యూత్ శిక్షణా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. మరుగుదొడ్లు ,స్నానపు గదులు, తనిఖీ చేసారు. కోవిడ్ పేషెంట్లకు చన్నీళ్లు, వేడినీటి సౌకర్యం కల్పించాలన్నారు. పూర్తి స్దాయిలో విద్యుత్తు, తాగునీటి సదుపాయాలు , మరుగుదొడ్లకు నిరంతరం నీటి సరఫరా అందించాలని అధికారులకు సూచించారు. ప్రతీ గదిలో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన పోషకాహారం, రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్నారు , కోవిడ్ కేర్ సెంటర్లో ముగ్గురు డాక్టర్లను, ఐదుగురు స్టాఫ్ నర్సులను,శానిటేషన్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. వారు నిరంతరం సేవలందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కెవి ఎస్ ఎన్ కుమార్, తాహశీల్దార్ ప్రకాశరావు, డి ఇ ఇ అనుదీప్, సహాయ గిరిజన సంక్షేమాధికారి ఎల్ . రజని తదితరులు పాల్గొన్నారు.