రేపటి నుంచి పర్యాటక ప్రాంతాలు బంద్..


Ens Balu
3
పాడేరు
2021-05-04 14:52:24

కోవిడ్ సెకండ్ వేవ్ నేపధ్యంలో విశాఖ ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను ఈనెల 5 వతేదీ నుంచి మూసి వేస్తున్నట్లు ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అరకువ్యాలీ మండలంలోని పెదలబుడు గిరి గ్రామ దర్శిని, మండల కేంద్రంలో ఉన్న గిరిజన మ్యూజియం , పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలం చాపరాయి జలపాతం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతాల ప్రవేశాలను రద్దు చేసామని ప్రకటించారు. పర్యాటకులను అనుమించ వద్దని సంబంధిత నిర్వహకులను ఆదేశించారు. మన్యంలో ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. అవసరం లేకుండా బయటకు రాకూడదన్నారు. బయటకు వెళ్లే వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. సామాజిక బాధ్యతతో కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.

సిఫార్సు