కరోనా కర్ఫ్యూకి ప్రజలు సహకరించాలి..


Ens Balu
3
అనకాపల్లి
2021-05-05 13:47:09

కరోనా కర్ఫ్యూకి ప్రజలు సహకరించాలని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ కోరారు. బుధవారం ఆయన కర్ఫ్యూ సందర్భంగా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా కర్ఫ్యూ నిర్వహించాలన్నారు. అదేవిధంగా అధికారులు, సిబ్బంది కూడా కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 50 ఆక్సిజెన్ బెడ్స్ తో పాటు, అదనంగా మరికొన్ని తన సొంత నిధులతో సమకూర్చినట్టు తెలియజేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ,ప్రజా ప్రతినిధులుగా మేము ఖచ్చితంగా ప్రజలకోసం పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరి బాబు , పట్టణ అధ్యక్షులు మంద పాటి జానకి రామ రాజు, 80 వార్డ్ ఇంచార్జి కొణతాల భాస్కర్ ,అనకాపల్లి RDO సీతారాం, జీవీఎంసీ కమిషనర్ శ్రీరామ్ మూర్తి , టౌన్ సిఐ భాస్కరరావు ,  అనకాపల్లి డిప్యూటీ తాసిల్దారు వెంకట్ , కశింకోట డిప్యూటీ తహసీల్దారు శేషు, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి  వైద్యఅధికారులు, జీఎంఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు