29 మందికి 2వ డోసు వేక్సినేషన్..


Ens Balu
2
శంఖవరం
2021-05-06 08:19:28

శంఖవరం పీహెచ్సీలో 29 మందికి రెండో డోసు కోవిడ్ వేక్సినేషన్ చేసినట్టు వైద్యాధికారి డా..ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. గురువారం ఆయన  ఆసుపత్రిలో మీడియాలో మాట్లాడుతూ, గతంలో మొదటి డోసు టీకా వేసిన 29 మందికి ఈ రోజు రెండో డోసు వేసినట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలంతా కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ పనులు చూసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. ఏ పనిచేసినా శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ కిట్లను కూడా అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.

సిఫార్సు