అల్లూరి సీతారామరాజకి ఘనంగా నివాళి..
Ens Balu
3
శంఖవరం
2021-05-07 06:58:22
విప్లవజ్యోతి, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర భావి పౌరులంతా తెలుసుకోవాలని ఉప సర్పంచి సిహెచ్ కుమార్ పిలుపునిచ్చారు. అల్లూరి 97వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రమైన శంఖవరంలో అల్లూరి విగ్రహానికి ఘవంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం అల్లూరి వీరోచిత పోరాటం చేసిన ధీరుడని కొనియాడారు. అంతేకాకుండా అప్పటి బ్రిటీష్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ కి మిరపకాయ్ టపా ద్వారా వర్తమానం పంపి తన పై దాడి చేయాలని సవాల్ విసిరిన అరుదైన ఘట్టానికి వేదికగా శంఖవరం గ్రామం కీర్తికెక్కిందన్నారు. అల్లూరి సీతారామరాజు ఒకరోజంతా గడిపిన గ్రామంగా కూడా తరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది రమణమూర్తి, కార్యదర్శి సత్య, మహిళా సంరక్షణ కార్యదర్శి జిఎన్ఎస్ శిరీష, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.