విప్లవజ్యోతి అల్లూరికి ఘనంగా నివాళులు
Ens Balu
3
క్రిష్ణదేవీపేట
2021-05-07 07:23:39
మన్యంలో మహోదయం సృష్టించిన ధీరుడు విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమ జాతి ఎన్నటికీ మరిచి పోదని సర్పంచి సత్యంనాయుడు, ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు అన్నారు. అల్లూరి 97వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం క్రిష్ణదేవిపేటలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం బ్రిటీషు ప్రభుత్వాన్ని ఎదరించి అల్లూరి సీతారామరాజు చేసిన మన్యం పితూరి ఒక చారిత్రక ఘట్టమన్నారు. అల్లూరి రచ్చబండ పంచాయతీలను ప్రారంభించి ప్రజలను చైతన్యం చేయడానికి వేదికైన గ్రామంగా కూడా క్రిష్ణదేవిపేట కీర్తికెక్కిందన్నారు. అల్లూరి పోరాటంలో దేశవ్యాప్తం కావడానికి కారణమైన చారిత్రక గ్రామంగా కూడా క్రిష్ణదేవీపేట చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాంతంలో మహానుభావుడు అల్లూరి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.