ప్రభుత్వభూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు...
Ens Balu
4
Nellipudi
2020-08-27 17:13:05
ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నవరం ఎస్ఐ శంకర్, ఎంపీడీఓ జె.రాంబాబులు హెచ్చరించారు. గురువారం టి.అగ్రహారం గ్రామంలో సర్వే నెంబరు 205లో 2.8 ఎకరాల్లో ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని వైఎస్సార్ హౌసింగ్ కాలనీ కోసం చదును చేస్తున్నట్టు వివరించారు. అనంతరం సచివాలయ అధికారులను ఆదేశిస్తూ, వారం రోజుల్లో ఈ భూమిని పూర్తిస్థాయిలో అభివ్రుద్ధి చేసి ప్లాట్లు చేయాలని తహశీల్దార్ కె.సుబ్రమణ్యం రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మళ్లీ ఎవరైనా ఈ భూమిలో ఆక్రమణలకు పాల్పడితే తక్షణమే వివరాలు తెలియజేయాలని కూడా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో నెల్లిపూడి గ్రామసచివాలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆక్రమణలను తొలగించిన చెత్తను ప్రొక్లైన్, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు.