కరోనాలో దాత్రుత్వం చాటుకున్న సర్వేయర్..


Ens Balu
4
శంఖవరం
2021-05-12 13:30:53

కరోనా వైరస్ విళయతాండం చేస్తున్న వేళ బాధితుల కష్టాలను చూసి చలించిన ఆ సర్వేయర్ తనవంతు సహాయంగా అన్నపానియాలు అందించి తన దాత్రుత్వాన్ని చాటుకుంటున్నాడు. ఎప్పుడూ నిరుపేదలకు సేవలు అందించే ఆ సేవకుడు.. కరోనా సమయంలో  సేవలను మరింతగా విస్త్రుతం చేస్తున్నాడు.. ఆసుపత్రుల వద్ద బాదితులకు బలవర్ధక ఆహారాన్ని అందించి వారికి సహాయం చేస్తున్నాడు. శంఖవరం మండలంలోని గ్రామ సచివాలయం-1లో సర్వేయర్ గా పనిచేస్తున్న సురేష్ రౌతుల పూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కోవిడ్ కేర్ రోగులకు, గర్భీణి స్త్రీలకు  బుధవారం ఉచితంగా భోజనాలు, మంచినీటి ప్యాకెట్లను అందించాడు. తనకున్న దానిలోనే పలు సేవా కార్యక్రమాలు చేసే ఈ యువకుడు కరోనా సమయంలో తాను సహాయం చేస్తూ అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నాడు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల కోసం, వారి ప్రాణాల కోసం సేవచేస్తున్న సమయంలో సేవ చేద్దామని అనుకున్నవారంతా ముందుకి వచ్చి బాధితులకు, నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా వారికి ఇలాంటి సమయంలో కాస్త దైర్యాన్ని ఇచ్చినవారమవుతామని చెబుతున్నాడు. తనతోపాటు సహాయం చేయడానికి ముందుకొచ్చే వారితో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలోని ఆసుపత్రుల్లో భోజనాలను అందిస్తున్నాడు. సర్వేయర్ సురేష్ చేస్తున్న ఈ ప్రజాసేవ పట్ల సచివాలయంలో పనిచేసే సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారంటూ ప్రోత్సహిస్తున్నారు. పెద్దగా ప్రచారం కోరుకోని ఈ యువ సేవకుడు దాత్రుత్వం సేవచేసేవారికి తెలిస్తే మరింత మంది ముందుకు వచ్చే అవకాశం వుంటుందనే కారణంతోనే ఈ సహాయాన్ని బాహ్య ప్రపంచం ద్రుష్టికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా తీసుకువస్తున్నాం. మనసున్న దాతలూ మీరూ ముందుకి వస్తే మరింత మంది నిరుపేదలకు సహాయం అందుతుంది..
సిఫార్సు