కరోనాలో సేవచేసే వారు నిజమైన దేవుళ్లు..


Ens Balu
4
Anakapalle
2021-05-12 15:26:50

కరోనా సమయంలో సేవచేయడానికి ముందుకి వచ్చే ప్రతీ ఒక్కరూ దేవుడితో సమానమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ అన్నారు. బుధవారం రామ్ కో సిమెంట్ కర్మాగారం యాజమాన్యం కోవిడ్ సేవల కోసం రూ.20లక్షలను ఎమ్మెల్యే సమక్షంలో ఎన్టీఆర్ ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎంతో ఉదార స్వభావంతో రామ్ కో సిమెంట్ యాజమాన్యం కోవిడ్ బారిన పడిన వారి సహాయార్ధం చేసిన సహాయం ఎంతో భరోసాని ఇస్తుందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో మనసున్న దాతలు ముందుకి వచ్చి కోవిడ్ రోగులకు నచ్చిన రూపంలో సహాయ సహకారాలు అందించవచ్చునని అమర్నాద్ పిలుపు నిచ్చారు. ఇలాంటి సమయంలో అన్నార్తులకు నిండు హ్రుదయమున్న దాతల సహాయం ఎంతో అవసరమన్నారు. రామ్ సిమెంట్ జీఎం రామ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పిలుపుతో తాము ముందుకి వచ్చి ఆక్సిజన్ సహాయం కోసం తమవంతు సేవ చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో  ఆర్డీవో జిక్కుల సీతారామారావు, పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామ రాజు, మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరి బాబు, నాయకులు  పీలా రాంబాబు, కొణతాల భాస్కర్, పలకా రవి, ఆళ్ళ నాగేశ్వరరావు, రాంకో కర్మాగారం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు