100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్..


Ens Balu
4
Araku Valley
2021-05-13 12:53:42

అరకువాలీ యూత్ శిక్షణా కేంద్రంలో ఈనెల 14 వతేదీ నుంచి వంద పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ను  ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేశారు. గురువారం  స్థానిక యూత్ శిక్షణా కేంద్రం, ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో చేరిన కోవిడ్ బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభత్వం నిర్దేశించిన మెనూ అందించాలని సూచించారు. మరుగుదొడ్లు, స్నానపు గదులకు నీటి సరఫరా ఉండేవిధంగా చూడాలని కోవిడ్ కేర్ సెంటర్ ఇంచార్జి అధికారులను ఆదేశించారు. అన్ని చోట్లా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఏరియా ఆసుపత్రికిలో కోవిడ్  వార్డ్  ను  పరిశీలించారు. కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చి లక్షణాలు లేనివారిని  కోవిడ్ కేర్ సెంటర్ కు తలరలించి తగినవైద్యం అందించాలని సూచించారు. ట్రూ నాట్ పరీక్షలపై ఆరాతీశారు.సేకరించిన నమూనాలను జాప్యం చేయకుండా పరీక్షలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు ,ఏరియా ఆసుపత్రి ప్రత్యేక అధికారి జి.విజయకుమార్ , ఆసుపత్రి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు